MRP : 120/-
రచయితలు : సంతోష్ అయ్యలసోమయాజుల & K సహదేవ్
రెండు తెలుగు రాష్ట్రాల స్నేహితులు, హిందూ కార్యకర్తలు అనేక మంది అనేక సందర్భాల్లో ఇలాంటి ఒక పుస్తకం వ్రాస్తే బాగుంటుందని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల హిందూ కార్యకర్తలతో పాటు వివిధ గ్రామాల్లోని ప్రజలు తమకు ఎదురయ్యే సమస్యలపై తమకు తాముగా పోరాటం చేసేందుకు కావాల్సిన అవగాహన కలిగే విధంగా ఒక పుస్తకం వ్రాస్తే బాగుంటుందని అనేకసార్లు కోరడంతో ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నాము. ప్రజలు తమకు ఎదురయ్యే సమస్యలపై న్యాయపోరాటం చేయడానికి న్యాయశాస్త్రం (లా) చదవాల్సిన అవసరం లేదు, దేశీయ చట్టాలపై కనీస అవగాహనా ఉంటే చాలు అని ఈ పుస్తకం చదివేవారికి అర్ధమవుతుంది. ఇది న్యాయ (లీగల్) పోరాటం చేసే వారిని దృష్టిలో పెట్టుకుని వ్రాసిన పుస్తకం.
క్రైస్తవ మతమార్పిళ్లపై పోరాటం అంశం ప్రధానంగా వ్రాసిన ఈ పుస్తకంలో లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ జరిపిన ప్రయోగాల గురించి మధ్యమధ్యలో ఉదాహరణలుగా వివరించడం జరుగుతుంది.
ఈ పుస్తకం చదివే పాఠకులకు, కార్యకర్తలకు గమనిక ఏమిటంటే, ఇందులో పొందుపరిచిన జీవోలు, చట్టాలు, నిబంధనలు కాలానుగుణంగా ఆయా పరిస్థితులను బట్టి, ప్రభుత్వాలను బట్టి మారే అవకాశం ఉంది.
Buy 5 or more copies |
Buy at Hindu eShop |
For Bulk Bookings contact +91 85209 99562 |