నవదధీచి మనడాక్టర్జీ (గద్య నాటకం) – Navadadheechi Manadoctorji (Prose Play)

150.00

New!

నిధులు ఇచ్చేవాడూ కార్యకర్తే. ఖర్చు చేసేవాడూ కార్యకర్తే. కార్యకర్తకీ, నేతకి, ధనదాతకీ, ధనస్వీకర్తకీ, ధనం ఖర్చుచేసేవాడికీ మధ్య ఏమాత్రం తేడాలేని భేదరహిత అద్వైత స్థితిని సాధించడమే ఆర్ఎస్ఎస్ ప్రత్యేకత. దీని అసలు బలం ఇదే.

Buy at Hindu eShop  Buy at Amazon

For Bulk Bookings contact +91 85209 99562

Description

అవి ఆర్ఎస్ఎస్ పై ఇందిరాగాంధీ నిషేధం విధించిన రోజులు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చాలామంది జైళ్లలో కనీసహక్కులు లేక మగ్గుతున్న రోజులు. ఆ సమయంలోనే ‘హూ ఈజ్ హూ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్’ అనే పుస్తకాన్ని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. స్వాతంత్య్ర సమరయోధుల వివరాలను పొందుపరిచిన పుస్తకం అది. అందులో ఒక ఎంట్రీ డాక్టర్ కేశవరావ్ బలిరామ్ హెడ్గేవార్ గారిది.

వారి గురించి వ్రాసిన వివరణలో డాక్టర్జీ గొప్ప దేశభక్తుడని, జాతీయవాది అని పేర్కొనడం, కాంగ్రెస్లో ఆయన పాత్ర వంటి వివరాలతో పాటు ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే దేశభక్త, జాతీయవాద సంస్థను ప్రారంభించారని కూడా – వ్రాశారు. అంతే కాదు. ఆర్ఎస్ఎస్ అత్యంత క్రమశిక్షణాయుతమైన సంస్థ అని ‘పేర్కొన్నారు. ఈ సంస్థ “ఆటో ఫైనాన్సింగ్” సంస్థ అని కూడా వ్రాశారు. అంటే తన నిధులను తానే సమకూర్చుకుంటుందని, ఇతరులపై ఆధారపడదని అర్ధం. చాలా సంస్థలలో కార్యకర్తలు వేరు, నాయకులు వేరు, నిధులు సమకూర్చేవారు వేరు. ఈ  ముగ్గురి మధ్యా సజీవ సంబంధం ఉండదు. ఎవరూ ఎవరికీ జవాబుదారీ కాదు.

కానీ ఆర్ఎస్ఎస్లో కార్యకర్తే నాయకుడు. నాయకుడూ కార్యకర్తే. నిధులు ఇచ్చేవాడూ కార్యకర్తే. ఖర్చు చేసేవాడూ కార్యకర్తే. కార్యకర్తకీ, నేతకి, ధనదాతకీ, ధనస్వీకర్తకీ, ధనం ఖర్చుచేసేవాడికీ మధ్య ఏమాత్రం తేడాలేని భేదరహిత అద్వైత స్థితిని సాధించడమే ఆర్ఎస్ఎస్ ప్రత్యేకత. దీని అసలు బలం ఇదే.

Paperback ; Pages : 112 ;Author : Durgadas

 

Reviews

There are no reviews yet.

Be the first to review “నవదధీచి మనడాక్టర్జీ (గద్య నాటకం) – Navadadheechi Manadoctorji (Prose Play)”

Your email address will not be published. Required fields are marked *