Description
ఇస్లాం మతం పదమూడు శతాబ్దాలుగా భారతదేశంలో ఉంది. ఇన్ని వందల సంవత్సరాలుగా హిందూ-ముస్లింలు కలిసి జీవిస్తున్నా, ఇస్లాం మతం పట్ల, ముస్లిం సమాజం పట్ల, హిందువులలో ఎటువంటి అవగాహన లేదు. ముస్లిం మత, సామాజిక, రాజకీయ వ్యవహారాలలో, జీవన విధానాలలో, ఇస్లాం మత ప్రభావం చాలా లోతుగా ఉంది. ఇస్లాం మతతత్త్వ శాస్త్రాలు, న్యాయ శాస్త్రాలపై అవగాహన కోసం, ప్రసిద్ధ రచయిత డా. శ్రీరంగ్ గొడ్బోలె గారి మరాఠీ, హిందీ, విశిష్ట రచనకి తెలుగు అనువాదం – `ఇస్లాం అంతరంగం’.
ఈ గ్రంధరచన మూడు భాగాలుగా సాగింది;
మొదటి భాగంలో ఇస్లాం మత మూలాధార విషయాలు, మరియు షరియత్ గురించిన విశేషాలు ఉన్నాయి,
వివిధ ముస్లిం మత సంప్రదాయాలు, ఉప సంప్రదాయాలు రెండవ భాగంలో ఉన్నాయి;
ఇస్లాం `స్త్రీలు’ మొదలైన వివిధ అంశాల గురించి ఏమి చెప్తుందో, మూడవ భాగం వివరిస్తుంది.
అల్-లాత్, అల్-ఉజ్జా, అల్-మనాత్ మొదలైన మహిళా దేవతలకు, ఇంకా అల్-లాహ్ అనే పురుష దేవుడికి, ఇస్లాం కంటే పూర్వం, ఆరబిస్తాన్ ప్రాంతంలో ఆదరణ ఉండేది. ఇస్లాం స్థాపించటంతో మహిళా దేవతలు నిరాకరించబడ్డారు, ఒక్క అల్లానే దేవుడిగా వాళ్ళు అంగీకరించవలసి వచ్చింది. ఇస్లాం ప్రకారం, మహిళల స్థాయి తక్కువగా ఎందుకు ఉన్నది?
వక్ఫ్ సంపదను కొంతమంది మోసపూరితంగా చేజిక్కించుకోవటం, దాని ఆదాయం దుర్వినియోగం చేయటం మొ|| భారత్ లో అన్నిచోట్లా జరుగుతూనే ఉన్నాయి. ముస్లిం సుల్తాన్ లు, హిందువుల ఆస్తులను అక్రమంగా చేజిక్కించుకుని, వక్ఫ్ గా మార్చేశారు.
ప్రేమ మరియు కరుణను సమర్థించేవారు సూఫీ ముస్లిములు అని హిందువుల భావన. అందుకే హిందువులు పెద్ద సంఖ్యలో సూఫీ దర్గాలకు వెళ్తారు, ఉర్సులకు వెళ్తారు, సమాధులపై చెద్దర్లు కప్పుతారు. ముస్లిములు అల్లాను, ప్రవక్తను, ప్రశంసిస్తూ పాడే పాటలను హిందువులు చాలా శ్రద్ధగా వింటారు. సూఫీల `మతసహనం’ అనే విషయంలో అసలు సత్యమెంత?
Reviews
There are no reviews yet.