Description
ఆఖరి ప్రవక్తగా ముస్లింలు చెప్పే మహమ్మద్ ప్రవక్త జీవితమే ఇస్లాంకు ఆధారం. ప్రవక్త ఏం చెప్పారో, ఏం చేశారో అదే తమకు ఆచరణీయం, అనుసరణీయని ముస్లింలు పదేపదే ప్రకటిస్తుంటారు. ఆ విధంగానే తాము నడుచుకుంటామని, నడుస్తున్నామని చెపుతారు.
ఇంతకీ మహమ్మద్ జీవితం ఏమిటి? ఆయన చెప్పిన, చేసిన పనులు ఏమిటి? అన్న విషయాలను వివరించే అనేక అరబిక్ గ్రంధాలు ఉన్నాయి. అలాగే అనేకమంది యూరోపియన్లు పరిశోధన చేసి ప్రవక్త జీవితచరిత్రను వ్రాశారు. అరబిక్ పండితుడు, పరిశోధకుడు డా. మార్గోలియత్ వ్రాసిన ‘Mohammad & The Rise of Islam’ అనే 600పేజీల బృహత్ గ్రంథపు సంక్షిప్త అనువాదమే ‘ఆఖరి ప్రవక్త – అతని మతం’. ఇస్లాం పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలనుకునేవారికి ఉపయుక్తమైనది.
Reviews
There are no reviews yet.