‘Navadadheechi Mana Doctorji’- Book Launch Event in Bhagyanagar

28 మార్చి 2026 నాడు ” నవ ధదీచి మన డాక్టర్జి ” పుస్తకవిష్కర్ణ కార్యక్రమం సా 6:30 కి ఖరఖానా లోని Adriotech office building సెల్లార్ లో జరిగినది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా గౌ శ్రీ దుందురుపు దుర్గా రెడ్డి గారు వెచ్చేసారు, వీరు రాష్ట్రీయ సేవా భారతి తెలంగాణ ప్రాంత అధ్యక్షులు, సంవిత్ సభ్యురాలు శ్రీమతి రాజేశ్వరి గారు మరియు పుస్తకం రచయత శ్రీ గోపరాజు వెంకట సుబ్బారావు గారు విచేశారు.

ముందుగా వందేమాతరం గీతం తో ప్రారంభం అయింది తరువాత శ్రీ కళ్యాణ్ చక్రవర్తి గారు పుస్తకం లోని ఒక అంకం డాక్టర్జి శ్రీ గురుపూజ ప్రసంగం యొక్క సన్నివేశం చక్కటి ప్రదర్శన చేసారు.

శ్రీమతి రాజేశ్వరి గారు శ్రీ రాముడిని డాక్టరజీ ని తో పోలుస్తూ, రాముడు వానరుల యొక్క సహాయం తీసుకొని వారధి కట్టి లంక కు చేరి రావణ్ణుని చంపారు అలాగే డాక్టరజీ అందరి సహాయం తో సంఘటన ప్రారంభించారు. ముఖ్య అతిధి గౌ శ్రీ దుర్గా రెడ్డి గారు మాట్లాడుతూ శతాబ్ది లో డాక్టరజీ పైన పుస్తకం రాసి ప్రచురణ చేయటం ఎంతో సంతోషకరం. కళ్ళకు కట్టినట్టి ఈ గద్యం భాగం ఎంతో ప్రేరణ దాయకంగా ఉందని చెప్పారు.

రచయత శ్రీ గోపరాజు వెంకట సుబ్బారావు రావు గారు మాట్లాడుతూ అమ్మ వారి ఉపాసకుడు అయినందున దుర్గాదాసుడిగా డాక్టరజీ పైన ఈ రచన మొదలు పెట్టాను, దీనిని రాకా సుధాకర్ గారి కి ఇచ్చి మెరుగులు దిద్దమని అడిగి తే, వారు సహృదయం తో చేసిపెట్టి సంవిత్ ప్రకాశన్ వారు ప్రచురణ చేస్తారని చెప్పి నాకు భరోసా ఇచ్చారు.
శ్రీ ఆయుష్ గారు పెద్దమనసు చేసుకొని ప్రచురుణ చేసినందుకు ధన్యవాదములు అని పుస్తకం లోని విషయాలు పంచుకున్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *