Description
‘కల్చరల్ మార్క్సిజం’ అనే ఈ పుస్తకంలో మార్క్సిస్టు సిద్ధాంతం సాంస్కృతిక వ్యవస్థల్లో ఎలా చొరబడింది, సమాజ వ్యవస్థ, విలువలు, సంప్రదాయాలపై ఏ విధమైన ప్రభావం చూపిస్తుందో రచయిత డా. నిరంజన్ బి. పూజార్ విమర్శనాత్మకంగా విశ్లేషించారు. చరిత్ర వక్రీకరణ ద్వారా భారతదేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న సైద్ధాంతిక యుద్ధం యొక్క మూలాలను అన్వేషిస్తూ, దురాక్రమణలు, వలస పాలనలో జరిగిన వక్రీకరణలు, కుటుంబం, విద్య, మీడియా వంటి సాంస్కృతిక వ్యవస్థల్లో చోటుచేసుకుంటున్న సైద్ధాంతిక చొరబాట్లు, ఫలితంగా ఆ వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్న విషయాలను ఈ పుస్తకం ప్రస్తావిస్తుంది. ‘క్యాన్సిల్ కల్చర్’ (Cancel Culture), ‘వోకిజం’ (Wokeism) వంటి ఉద్యమాల సునిశిత పరిశీలనతో పాటు అవి సామాజిక ఐక్యతను అస్థిరపరుస్తూ, స్వదేశీ విలువలను ఎలా క్షీణింపజేస్తున్నాయో ఈ పుస్తకం విశ్లేషిస్తుంది. ఈ తరహా శక్తులను ఎదిరించి సమన్వయపూరితమైన, శక్తివంతమైన భవిష్యత్తు కోసం సాంస్కృతిక సహనశక్తిని తిరిగి సాధించాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటిస్తూ ఈ పుస్తకం భారతీయ తత్వశాస్త్ర పునరుజ్జీవనానికి పిలుపునిస్తుంది.
ISBN: 978-81-991567-9-1 ; Author: Niranjan Poojar ; Paperback ; Samvit Prakashan
About the Author:
డా. నిరంజన్ బి. పూజార్ కర్ణాటక కేంద్ర విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. ప్రముఖ పరిశోధకులు, విద్యావేత్త ఐన డా. నిరంజన్ బి. పూజార్ సప్లై చైన్ మేనేజ్మెంట్, స్ట్రాటజీ మేనేజ్మెంట్ రంగాల్లో నిపుణులు. ‘వచన దర్శన’, ‘కర్ణాటక వైభవ’ వంటి ప్రసిద్ధ గ్రంథాలకు సంపాదకులుగా వ్యవహరించిన వీరు ఇరవై ఐదుకు పైగా పరిశోధనా పత్రాలను ప్రచురించారు. ‘Kinnal Toys Clusters and Bioenergy Research Centre’ సహా ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే అనేక ప్రాజెక్టులకు డా. నిరంజన్ నాయకత్వం వహించారు. మేధోపరమైన కార్యకలాపాల పట్ల ఏంతో ఆసక్తితో ‘స్వదేశీ పరిపాలన’, ‘ఎంట్రప్రెన్యూర్షిప్’ వంటి అంశాలపై మేధోపరమైన చర్చలను నిర్వహిస్తున్నారు. ‘ప్రజ్ఞా ప్రవాహ్’ సంస్థకు ఉత్తర కర్ణాటక కన్వీనర్‌గా భారతీయ తత్వశాస్త్రం, సమగ్ర అభివృద్ధి, ఆచరణల ఆధారంగా సాగుతున్న పరిశోధనలను ముందుకు తీసుకువెళ్లడంలో డా. నిరంజన్ కట్టుబడి నిమగ్నమై ఉన్నారు.

For Bulk Bookings contact +91 85209 99562
Reviews
There are no reviews yet.