Description
‘కంటికి కనపడేది, ఇంద్రియాల పరిమిత శక్తికి అందేది మాత్రమే యదార్థం. అలా కానిది అబద్ధం’ అని బోధించేది చార్వాకం. ‘ఇంద్రియాలతో మనం గ్రహించగలిగిన దానికన్నా యధార్థం. ఇంకా ఎంతో ఉంది’ అని చెప్పేది ఆస్తికత లేక వైదికత. మానవుడి కన్ను, చెవి, నోరు మొదలైనవి, ఆఖరుకు బుద్ధికి కూడా పరిమితి ఉంది. కాబట్టి ప్రకృతిలో ఈ ఇంద్రియాలకు అందని జ్ఞానం ఎంతో ఉంది.
నాస్తికవాదులు, హేతువాదులు, కమ్యూనిస్టులు (వీరిలో మార్క్సిస్టులు, మావోయిస్టులు రెండు ముఠాలు) ప్రత్యక్ష చార్వాకులు. ముస్లిములు, క్రైస్తవులు పరోక్ష చార్వాకులు. ఈ ప్రత్యక్ష, పరోక్ష బృందాల మధ్య అనేక శతృత్వాలు, పోటీలు ఉన్నాయి. అయినప్పటికీ వారందరూ పరస్పరం సహకరించుకొని హిందూ మత సంస్కృతులను బలహీనపరచి, నాశనం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు.
ముస్లిములు తమది శాంతిమతమని చెప్పుకుంటారు. ఇస్లాం చరిత్రము, మత గ్రంథాలను, పరిశీలిస్తే ఆ మతం అశాంతిని, హింసను, దోపిడిని ప్రవక్త పేరుతో, దేవుడి పేరుతో ప్రోత్సహించే మతమని స్పష్టమవుతుంది. ఇస్లాం మతగ్రంథాలను, ప్రవక్త మాటలు, చేతలను పరిశీలిస్తే పై మాటల్లో నిజం తెలుస్తుంది.
తమ మతం ప్రేమను బోధించే మతమని, యేసు మానవుల మీది ప్రేమతో, వారి పాపాలకు పరిహారంగా తాను శిలువ ఎక్కాడని క్రైస్తవులు చెప్పుకుంటారు. ఆ మతచరిత్రను, వారి పవిత్ర గ్రంథమైన న్యూ టెస్టమెంట్ (నూతన నిబంధన) లేక క్రైస్తవ బైబిల్ ను చూస్తే ‘ప్రేమ’ మతం హింసను, దురాక్రమణను బానిస వ్యాపారాన్ని, దోపిడిని దైవదూత పేరుతో, బైబిలు పేరుతో గత 2000 కొనసాగిస్తున్నదని స్పష్టమౌతుంది.
మానవ ప్రవృత్తిలోని అరిషడ్వర్గాలపైన, కేవలం ఆర్థిక ప్రచోదన పైన నిర్మించిన కమ్యూనిజం పాక్షికమైన ప్రమాదకరమైనది. అది మానవుడిని ప్రలోభపెడుతుందే తప్ప సుఖపెట్టదు, సంతోష పెట్టదు. మనిషిలోని అసంతృప్తిని కసిగా, ద్వేషంగా, వైరంగా మార్చి సమాజాన్ని సంక్షుభితం చేస్తుంది. అలాంటి సంక్షోభం వల్ల మొదట నష్టపోయేది బడుగుజీవే. కమ్యూనిజం చరిత్ర నిండా కనిపించే లక్షలాది మంది సామాన్య, నిస్సహాయ ప్రజల ఊచకోతలే ఇందుకు సాక్ష్యం, కమ్యూనిజం చరిత్ర ఈ సత్యాన్నే నిరూపించింది.
ISBN : 978-81-960217-8-8 ; Pages : 190 ; Paperback
Reviews
There are no reviews yet.