రచయిత : కందకుర్తి ఆనంద్
MRP: ₹40/
Pages : 40
భారదేశ చరిత్రలో 18వ శతాబ్దం ఎంతో క్లిష్టమైనది. గొప్పగొప్ప రాజులు అంతరించారు. మరఠాలు శక్తివంతులవుతున్నారు. మరోవైపు బ్రిటిష్ వారు (ఈస్ట్ ఇండియా కంపెనీ) భారత్ ను తమ అధీనంలోకి తీసుకువచ్చే పని మొదలుపెట్టారు. మిషనరీలు క్రైస్తవ మతప్రచారం ముమ్మరం చేశారు. ఈ మూడు శక్తుల పోరాటం నడుస్తున్నది. అలాంటి పరిస్థితుల్లో సేవాలాల్ మహారాజ్ అవతరించారు. క్రైస్తవీకరణ సాగుతున్న సమయంలో బంజారాలలో హిందూ చైతన్యాన్ని పెంపొందించారు. భక్తి యుగంలో జన్మించిన మహాత్ములలాగా భక్తిని ప్రేరేపించారు. భక్తి ఆయుధంగా సంస్కరణ చేశారు. సమాజాన్ని సంఘటితం చేశారు. రాబోయే పరిణామాలను ముందుగా పసిగట్టారు. ఆ మహాత్ముని జీవిత చరిత్ర అందరూ చదవాలి. ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. కందకుర్తి ఆనంద్ వ్రాసిన ఈ సంక్షిప్త జీవిత చరిత్ర సేవాలాల్ గురించిన ముఖ్యమైన సమాచారాన్ని మన ముందుంచుతుంది.
![]() |