జిహాద్ – ఇస్లాం నిరంతర మత యుద్ధం – Jihad (Telugu enlarged edition)

250.00

ఈ పుస్తకంలో ఒకచోట చెప్పినట్లుగా ఇస్లాం మతాన్నో, లేక ఇతర సెమెటిక్ మతాలనో దురుద్దేశపూర్వకంగా నిందించడానికో, లేక అప్రతిష్టపాలు చేయడానికో ఈ పుస్తకాన్ని వ్రాయలేదు. ఇస్లాం  అధికారిక, అంగీకృత గ్రంధాల్లో ఏమి చెప్పారో దాన్ని మాత్రమే వివరించడం జరిగింది. అంటే ఈ పుస్తకం ఇస్లాంకి అద్దంపడుతుందేతప్ప  వ్యాఖ్యానించదు. అసలు రూపం ఎలా ఉంటే ప్రతిబింబం అలా ఉంటుంది. ఒకవేళ మనం చూసినది బాగా లేకపోతే అందుకు అద్దాన్నో,అద్దాన్ని చూపించిన వాడినో నిందించరాదు.

Buy at Hindu eShop 

For Bulk Bookings contact +91 85209 99562

 

Description

జిహాద్  : ఇస్లాం నిరంతర మత యుద్ధం

Enlarged Edition

ఇవాళ ఉగ్రవాదం ప్రపంచాన్ని వణికిస్తున్న అతి తీవ్రమైన ఉపద్రవం. ఉగ్రవాదం ఒక విధమైన మనస్తత్వం నుంచి పుడుతుంది. కొన్ని మతాలు తమ అనుయాయుల్లో అటువంటి మనస్తత్వాన్ని రూపొందిస్తాయి. నిజానికవి మతాలు కావు. మతరూపంలో ఉన్న సామ్రాజ్యవాద రాజకీయ ఉద్యమాలు. అలాంటి మతరూప సామ్రాజ్యవాద ఉద్యమాల నిజరూపాన్ని గుర్తించి తమను తాము రక్షించుకోవడం ప్రతి నాగరికుడి ప్రాణావసరం.

ఈ పుస్తకం ఇస్లాం మూలాధారాలలో ప్రతిబింబించే ఆ మత మూల స్వరూపాన్ని పాఠకుల ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఇస్లాం యొక్క రెండు ముఖ్య లక్షణాలైన జిహాద్, జిజియాల విషయంలో ఇస్లాం మూల గ్రంధాలు ఏం చెపుతున్నాయో ఉదాహరణ పూర్వకంగా వివరిస్తుంది.

చివరిగా ఇస్లాం వంటి సెమెటిక్ మతాల మూల ప్రేరణ ఎలాంటింది? ఆ ప్రేరణల వ్యక్తీకరణ స్వరూపమెలా ఉంటుంది? అనే మౌళిక విషయాలను యోగదర్శనం సహాయంతో విశ్లేషించి వివరించే ప్రయత్నం చేస్తుంది.

ఈ పుస్తకం అనువాద ప్రధానమైనది. జిహాద్ గురించిన సమాచారానికి ఆధారం సుహాస్ మజుందార్ రచించిన “జిహాద్ – ది ఇస్లామిక్ డాక్ట్రిన్ ఆఫ్ పర్మనెంట్ వార్“ అనే ఇంగ్లీష్ పుస్తకం. ఇక జిజియాకు సంబంధిచిన సమాచారానికి ఆధారం డాక్టర్ హర్ష్ నారాయణ్ రచించిన “జిజియా అండ్ ది స్ప్రెడ్ ఆఫ్ ఇస్లాం” అన్నే చిన్న అమూల్య గ్రంధం. సెమెటిక్ మతాల యోగ విశ్లేషణకు మూలం అనిర్వాణ్ యొక్క “ఇన్నర్ యోగా” అనే పుస్తకానికి రామ్ స్వరుప్ వ్రాసిన విలువైన ఉపోద్ఘాతం.

ఈ మూడు గ్రంధాలను వాయిస్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ వారు ప్రచురించారు. పాఠకుల సౌకర్యం కోసం ఇస్లాం మతం యొక్క మూలాధారాలను రెండవ అధ్యాయంలో కొద్దిగా వివరించాను. దీనికి ముఖ్య ఆధారం థామస్ పాట్రిక్ హ్యుగెస్ యొక్క ప్రసిద్ధ ఆంగ్ల నిఘంటువు – “డిక్షనరీ ఆఫ్ ఇస్లాం”. దీన్ని రూపా పబ్లికేషన్స్ వారు ప్రచురించారు. మొదటి భాగం చివర కొన్ని ఉపయుక్త గ్రంధాలను, సాంకేతిక పదాల వివరణను ఇచ్చాను.

ఈ పుస్తకంలో ఒక చోట చెప్పినట్లుగా ఇస్లాం మతాన్నో, లేక ఇతర సెమెటిక్ మతాలనో దురుద్దేశపూర్వకంగా నిందించడానికో, లేక అప్రతిష్టపాలు చేయడానికో ఈ పుస్తకాన్ని వ్రాయలేదు. కేవలం ఇస్లాం యొక్క అధికారిక, అంగీకృత గ్రంధాల్లో ఏమి చెప్పారో దాన్ని మాత్రమే వివరించడం జరిగింది. అంటే ఈ పుస్తకం ఇస్లాం కి అద్దం పడుతుందే తప్ప వ్యాఖ్యానించదు. అసలు రూపం ఎలా ఉంటె ప్రతిబింబం అల ఉంటుంది. ఒకవేళ మనం చూసినది బాగా లేకపోతే అందుకు అద్దాన్నో,అద్దాన్ని చూపించిన వాడినో నిందిచరాదు. ఈ పుస్తకం చేసే పని ఇస్లాం కి అద్దం చూపెట్టడం మాత్రమే. ఇస్లాంను సరిగా అర్ధం చేసుకోవడం లో ముస్లిములకు, ముస్లిమేతరులకు కూడా ఈ పుస్తకం సహాయపడుతుంది.

ఇవాళ ప్రపంచానికి చేటు తెచ్చే మనస్తత్వాలను, వాటినుంచి పుట్టే సిద్ధాంతాలను, ఆ సిద్ధాంతాలకు ఆచరణ రూపమైన ఉద్యమాలను తరచి చూసి, అర్ధం చేసికొని జాగ్రత్తపడవలసిన  అవసరం ఎంతో ఉంది. ఆ దిశలో చేసిన చిన్న ప్రయత్నమే ఈ పుస్తకం. ఆలోచనాపరులైనవాళ్లు స్వార్ధపరుల ప్రచార ఆర్భాటానికి, భయపెట్టే ప్రయత్నాలకూ లోబడకుండా సత్యాన్వేషణ చేస్తారని ఆశిస్తాను.

ISBN : 978-81-983858-3-3 ; Author : Mukkanti ; Pages : 230 ;

Publisher : Samvit Prakashan ; Paperback ;

Reviews

There are no reviews yet.

Be the first to review “జిహాద్ – ఇస్లాం నిరంతర మత యుద్ధం – Jihad (Telugu enlarged edition)”

Your email address will not be published. Required fields are marked *