బంగ్లా హిందువుల అజ్ఞాత మరణకాండ Bangla Hinduvula Agnyata Maranakanda

120.00

New!
ముందు మాట :
శ్రీ బండి సంజయ్ కుమార్ , ఎం. పి 
హోం వ్యవహారాల సహాయ మంత్రి,
భారత ప్రభుత్వం
బంగ్లాదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న హిందువులపై జిహాదీ ముసుగులో రాక్షస మూకలు జరుపుతున్న అరాచకాలను చూసి యావత్ ప్రపంచం నివ్వెరపోతోంది. ఇప్పుడంటే ఇంటర్నెట్, మీడియా ప్రసార మాద్యమాలు అందుబాటులో ఉన్నందున ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో తెలుసుకోగలుగుతున్నాం. కానీ ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళితే…
బంగ్లాదేశ్ ఆవిర్భావ సమయంలో, ఆ తరువాత హిందువుల మీద జరిగిన అకృత్యాలు, దారుణ మారణకాండను తలుచుకుంటే నేటికీ ఒళ్లు జలదరిస్తోంది. కానీ మీడియా, ప్రసార మాద్యమాలు, సోషల్ మీడియా అందుబాటులో లేకపోవడంతో ఇవేవీ ప్రజలకు పెద్దగా తెలియకుండా పోయాయి. ఆ దారుణ మారణకాండ కాలంలో కొన్ని లక్షలమంది హిందువులు జిహాదీ శక్తుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. వేలమంది హిందూ ఆడపడచరులు లైంగిక దాడులకు గురయ్యారు. లక్షల మంది హిందువులు ఇల్లు, ఆస్తిపాస్తులను వదిలేసి కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భారతదేశం వలస వచ్చి వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఆ శరణార్థులలో ఎంతోమంది కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో నివసిస్తున్నారు.
ఇంకా లోతుల్లోకి వెళితే….1947లో దేశ విభజన సమయంలో తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్) మొత్తం జనాభాలో హిందువులు 31 శాతంగా ఉండేవారు. కానీ నేడు అదే బంగ్లాదేశ్ లో హిందువుల జనాభా 3 శాతానికి పడిపోయింది. కానీ భారత్ విషయానికొస్తే… 1951లో 84 శాతమున్న హిందూ జనాభా 2011 జనాభా గణంకాల ప్రకారం 79 శాతానికి పరిమితమైంది. అదే సమయంలో 1951లో 9 శాతమున్న ముస్లిం జనాభా ప్రస్తుతం 15 శాతం దాటింది. దీనిని బట్టి పరిస్థితి ఎట్లుందో అర్ధం చేసుకోవచ్చు. బంగ్లాదేశ్ లో హిందువులపై ఎలాంటి దారుణకాండ జరుగుతుందో తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది.
నాటి విషాద ఘట్టాలను, వాస్తవాలను మన జాతి మరిచిపోతే చరిత్ర పునరావృతం అయే అవకాశం ఉంటుంది. హిందువుల మనుగడే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదముంది. వారి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఈరోజు మనకు ఉంది. శరణార్థుల దారుణ అనుభవాలను లిఖిత రూపంలో ‘బంగ్లా హిందువుల అజ్ఞాత మారణకాండ’ పేరుతో పుస్తక రూపంలో సంవిత్ ప్రకాశన్ వారు ప్రచురించి మన ముందుకు తీసుకురావడం ఎంతో అభినందనీయం. రచయితతోపాటు ఈ పుస్తకాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు అహర్నిశలు క్రుషి చేసిన వారందరికీ నా హ్రుదయపూర్వక శుభాకాంక్షలు.
భారత మాతాకీ జై…..

 

Buy at Hindu eShop 

For Bulk Bookings contact +91 85209 99562

Description

Authors in Kannada : Rohit Chakrateerth; Vrushank Bhat,Praveen Patwardhan, Geervani; Vinayak Bhat;
Translated from Kannada : Smt. Parimala Nadimpalli
Telugu Authors : Surender K ; AS Santosh
1947లో భారత దేశ విభజన, 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భావం నేపథ్యంలో ఇస్లామిక్ జిహాది మూకలు చేసిన దారుణ మారణకాండ కారణంగా కొన్ని లక్షల హిందూ కుటుంబాలు ధ్వంసం అయ్యాయి. హిందువులు తమ పూర్వీకుల నుండి సంక్రమించిన ఇళ్లు, భూమి, వ్యాపారాలు, ఆస్తిపాస్తులతో పాటు బంధాలన్నీ తెంచుకుని 1971-1974 సమయంలో అర్ధాంతరంగా భారతదేశానికి వలస రావాల్సి వచ్చింది.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆనాడు ఛత్తీస్ గడ్ రాయ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరం లో కొంతకాలం ఉన్నారు. అక్కడి నుంచి కొన్ని కుటుంబాలు ప్రభుత్వ సహాయంతో 1974-76 మధ్య తెలంగాణలోని సిర్పూర్ కాగజ్‌నగర్‌ పరిసరాల్లో 17 గ్రామాల్లో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ప్రస్తుతం వారి జనాభా 20 వేలకు పైగా ఉంది. వాటిలో కౌతాల మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో రవీంద్ర నగర్ 1 మరియు రవీంద్ర నగర్ 2 గా వెలసిన గ్రామంలోని బంగ్లాదేశీ హిందూ శరణార్థుల కథనాలు ఈ పుస్తకం లో వివరించబడ్డాయి.
ISBN : 978-81-976091-8-3; Publisher : Samvit Prakashan ; Paperback ; Pages : 80;

Reviews

There are no reviews yet.

Be the first to review “బంగ్లా హిందువుల అజ్ఞాత మరణకాండ Bangla Hinduvula Agnyata Maranakanda”

Your email address will not be published. Required fields are marked *