ఇండియా నుండి భారత్ – ఒక ప్రయాణం-పుస్తక సమీక్ష

సంవిత్ ప్రకాశన్ వారు ప్రచురించిన ఈ పుస్తకం దేశం లోని 140 కోట్ల మంది ప్రజల స్వాతంత్ర్యానంతర ప్రయాణం తాలూకా ప్రతీకగా కనపడుతుంది. 180 పేజీల ఈ పుస్తకం ఏక బిగిన చదివేసేంత ఉత్సాహభరితంగా ఉంది. ప్రఖ్యాత రచయిత ప్రశాంత్ పోలే గారి ఆంగ్ల రచనకు స్వేఛ్ఛాను వాదం .

ఈ పుస్తకం భారతీయ భవ్య చరిత్ర కు సంబందించిన ఒక కీలకమైన అధ్యయనం. ఈ దేశం ఒక దేశమే కాదు, పాశ్చాత్యుల వల్లనే దేశం గా మారింది అనుకునే వారికీ – అనాదిగా ఈ దేశం ఒక మూల సూత్రం పై నిలచి ఉన్న అఖండమైన ఒక విస్త్రుతీ అన్న సత్యం తెలిసిన వారికీ – ఇరువర్గాల కూ ఒక ఉపయుక్తమైన గ్రంధం.

” దేశమే మొదటి ప్రాధాన్యతా అంశం” అని నమ్మే ప్రతీ వ్యక్తి చదివి తీరవలసిన పుస్తకం ఇది. నా వరకు నాకు ఈ పుస్తకం మూడు భాగాలుగా కనిపిస్తుంది. మొదటిది స్వాతంత్ర్యం పొందిన మొదటి 30-35 సంవత్సరాలు ( 1947-1967) మనం అవకాశాలను ఎలా కోల్పోయాము . రెండవది రెండవ 30-35 సంవత్సరాలు ( 1967-2004) మన నాయకుల లో ఉన్న వైవిధ్యం – కొందరి స్వార్ధం, కొందరి అవినీతి, కొందరి బంధుప్రీతి – కొందరి పోరాట తత్వం, కొందరి నిస్వార్థం….

మూడవది ముఖ్యమైనది 2004 – నేటివరకు, అతి జుగుప్సాకరమైన అవినీతి బంధు ప్రీతి – ఆ అవినీతిని కూకటి వేళ్ళతో పెకలించి వేసిన ప్రజా బాహుళ్యం. అవకాశాలను ప్రణాళికా బద్దంగా వాడుకుంటూ మమేకమై నిలచి, విశ్వ గురు స్ధానాన్నీ అందుకోవడానికి జరిగిన ప్రయత్నాలు వాటి వివరాలు.

ఏతావాతా తమ మూలాలు అర్థం చేసుకొన్న దేశాలు, దేశ నాయకత్వం ఆ దిశగా ప్రయత్నం చేస్తే, ఎంతటి గడ్డు పరిస్థితి లోనైనా ప్రజలు పూర్తి సహకారం అందిస్తారని ఖచ్చితంగా తెలియజేస్తున్న పుస్తకం. సకారాత్మక ఆలోచన కలిగిన ప్రతి దేశభక్తుడు చదివి తీరాల్సిన పుస్తకం ఇది.

చంద్రమౌళి కళ్యాణచక్రవర్తి
దక్షిణాపథ స్టడీస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *