మిషనరీ మాయాజాలం – పాశ్చాత్య పంజరంలో తాంత్రిక భారతం – పుస్తక సమీక్ష

‘మిషనరీ మాయాజాలం – పాశ్చాత్య పంజరంలో తాంత్రిక భారతం’ అనే ఈ మహద్గ్రంధంలో ప్రముఖ రచయిత, పరిశోధకులు శ్రీ మైలవరపు సుధామోహన్ గారు, బ్రిటిష్ కలోనియల్ / వలసవాద పాలనలో హైందవ ధర్మానికి వ్యతిరేకంగా మిషనరీలు పన్నిన కుట్రలు, మొత్తం భారతీయ నాగరికతను క్రైస్తవ మతచట్రం కింద ఇరికించి చేసిన వక్ర వ్యాఖ్యానాలు, వారు అవలంబించిన వక్రమార్గాలు, అనేక వక్రీకరణల గురించి సవివరంగా సోదాహరణంగా వ్రాసారు.