ఆ 15 రోజులు Aa 15 Rojulu

Author: Prashant Pole

MRP: Rs 140/-

About the book : 

  • Original in Hindi. Translated to Telugu by Vishwa Samvaad Kendra, Telangana

ఆ 15 రోజుల్లో అనేక సంఘటనలు జరిగాయి….! అవన్నీ ప్రత్యేకమైనవే. ఆ 15 రోజులు మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పాయి.. ఆ సమయంలో సాగిన ఈ భయంకర మారణకాండలో 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

 

ఒకటిన్నర కోట్లమంది శరణార్ధులుగా మిగిలారు. ఢాకాలోని ఢాకేశ్వరీ దేవి ఆలయం మనది కాకుండా పోయింది. బారిసాల్ కాళికాదేవి దర్శనం చేసుకోవడం, దుర్గా సరోవరంలో పుణ్యస్నానం చేయడం ఇక మనకు సాధ్యం కాదు. సిక్కు మతపు సంస్థాపకుడైన గురునానక్ జన్మస్థలమైన నన్ కానా సాహెబ్ ఇక మన దేశంలో భాగం కాదు. హింగలాజ్ దేవి దర్శనం చేసుకోవడం మనకు వీలుకాదు. మౌంట్ బాటన్ చెపితే స్వతంత్ర భారతంలో కూడా యూనియన్ జాక్ (బ్రిటిష్ జెండా) ఎగురవేయడానికి సిద్ధపడిన నెహ్రూ ధోరణి మనం చూశాం. `లాహోర్ మరణిస్తే దానితోపాటు మీరు కూడా చచ్చిపోండి’ అని గాంధీజీ లాహోర్ లో హిందువులకు చెప్పిన రోజునే `రాజా దాహిర్ నుంచి ప్రేరణ పొంది, ధైర్యంతో, కలిసి జీవించండి’అంటూ హైదారాబాద్ (సింధ్)లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ శ్రీ గురూజీ ధైర్యాన్ని నింపడం కూడా చూశాం. సింధీ మహిళలు బాగా అలంకరించుకుని, అందమైన దుస్తులు ధరిస్తారు కాబట్టే ముస్లింలు వారిని వేధిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడి భార్య సుచేత కృపలానీ హిందూ మహిళలకు `బోధిస్తున్నప్పుడే’, `హిందూ మహిళలు సంస్కారవంతులు, శక్తిశాలులు, సమర్ధులుగా ఉండాలి’ అంటూ కరాచీలో రాష్ట్ర సేవికా సమితికి చెందిన మౌసీజీ  చెప్పడం చూశాం. కాంగ్రెస్ లోని హిందూ కార్యకర్తలు ప్రాణభయంతో పాకిస్థాన్ వదిలిపెట్టి భారత్ కు పారిపోతే, ముస్లిం కార్యకర్తలు ముస్లిం లీగ్ తో కలిసిపోయారు. కానీ సంఘ స్వయంసేవకులు ధైర్యంగా నిలబడి ప్రాణాలను సైతం ఒడ్డి హిందువులు, సిక్కులను సురక్షితంగా భారత్ కు చేర్చడం కూడా చూశాం. ఆలోచనావిధానంలో, పని చేసే పద్దతిలో ఎంత తేడా…? ఆ 15 రోజుల కీలక సంఘటనల గురించిన ఉత్కంఠభరిత కథనం ఈ పుస్తకం…. తప్పక చదవండి…చదివించండి.

Publisher: Samvit Prakashan ;

Language: Telugu ;

Paperback.

Buy at Hindu eShop     Buy at Amazon

For Bulk Bookings contact +91 85209 99562

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *