పుస్తక సమీక్ష: మిషనరీ మాయాజాలం – పాశ్చాత్య పంజరంలో తాంత్రిక భారతం

శ్రీ సుధామోహన్ ఏవియేషన్ రంగంలో Maintenance Engineer. కెనడాలో ఉద్యోగి అయినా హృదయమంతా భారత్ పైనే, హిందూ సమాజం పైనే. వీరు మంచి విశ్లేషకులు, అనువాదకులు, పరిశోధకులు.వీరు లోగడ రచించిన పుస్తకాల్లో మన దేశం ఎదుర్కొంటున్న అనేక సామాజిక సమస్యలను చాలా లోతుగా చర్చించారు. కుహనా మేధో నియంతలు, శివస్య కులం దీనికి ఉదాహరణలు. ప్రస్తుత గ్రంథం మిషనరీ మాయాజాలం నాలుగు అధ్యాయాలు, దాదాపు 60 కి పైగా వ్యాసాల సమాహారం.