సంవిత్ ప్రకాశన్ మరియు సంవిత్ కేంద్ర వారి సంయుక్త ఆధ్వర్యంలో స్నేహ మిలన్’ కార్యక్రమం, జనవరి 26 నాడు భాగ్యనగర్, ఖైరతాబాద్ లోని శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో జరిగింది. సంవిత్ ప్రకాశన్ సంస్థ 4 వ వార్షికోత్సవం సందర్బంగా ఈ కార్యక్రమం జరిగింది. వసంతి పంచమి నాడు ఆవిర్భవించిన సంవిత్ ప్రకాశన్ ఇప్పటి వరకు సాహిత్య సేవలో భాగంగా దాదాపు 25 పుస్తకాలను తెలుగు, ఇంగ్లీష్ హిందీ భాషలలో ప్రచురించింది.
సంవిత్ కేంద్ర సరికొత్త గ్రంధమ్ – మహేతిహాసం
ఖండవల్లి సత్య దేవ ప్రసాద్ గారి విశ్లేషణాత్మకవ్యాసాలు. మహాభారతంలోని అనేక విషయాలను గురించి వివరిస్తారు. మూల గ్రంధాన్ని అధ్యయనమ్ చేయకుండా కొంతమంది కల్పించిన అపోహలను అసత్యాలను ఎండగట్టి వ్యాస భారతమ్ లోని శ్లోకాల ఆధారంగా పరిశిలించి వ్రాయబడిన ఈ పుస్తకం మూల మహాభారత అద్యయనానికి ప్రేరణ ఇస్తుంది, మహేతిహాసం.